ఈసారి వ‌ర్షాలు.. సాధార‌ణం క‌న్నా త‌క్కువే!

బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:20 IST)
ఈ ఏడాది వర్షాలు సాధారణం కన్నా తక్కువే ఉంటాయని స్కైమెట్ వాతావరణ సంస్థ వెల్లడించింది. ప్రతి సంవత్సరం జూన్ మాసం ప్రారంభంలో రుతుపవనాలు కేరళ రాష్ట్రంలో ప్రవేశించే విషయం తెలిసిందే. రుతుపవనాలు ఆ రాష్ట్రాన్ని తాకిన తర్వాతే దేశ‌వ్యాప్తంగా విస్తరిస్తాయి. అయితే ఈ ఏడాది సాధార‌ణ వ‌ర్షపాతం క‌న్నా త‌క్కువే వర్షాలు కురుస్తాయని స్కైమెట్ సంస్థ చెప్పింది. 
 
లాంగ్ పీరియ‌డ్ రేంజ్‌(ఎల్‌పీఏ)లో రుతుప‌వ‌నాల ప్ర‌భావం 93 శాతం ఉంటుంద‌ని ఆ సంస్థ అంచ‌నా వేసింది. వ‌ర్ష‌పాతం 90 నుంచి 95 శాతం ఉందంటే, అది బిలో నార్మ‌ల్ రేంజ్ అని ఆ సంస్థ పేర్కొంది. 1951 నుంచి 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఎల్‌పీఏ వ‌ర్ష‌పాతం స‌గ‌టున‌ 89 సెంటీమీట‌ర్లు ఉంది. ఎల్‌నినో ప్ర‌భావం వ‌ల్లే వ‌ర్ష‌పాతం ఈసారి సాధారణం క‌ంటే త‌క్కువ‌గా ఉంటుంద‌ని స్కైమెట్ సీఈవో జ‌తిన్ సింగ్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు