కేరళ: వాడు ప్రియుడా లేకుంటే మానవ మృగమా.. ప్రియురాలి మృతి.. ఏమైందంటే?

సెల్వి

శనివారం, 1 ఫిబ్రవరి 2025 (14:46 IST)
కేరళలో ప్రియుడి అకృత్యం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. కేరళ, చొట్టనిక్కరలో 19 ఏళ్ల బాలిక ప్రియుడి ఘాతుకానికి మృతి చెందింది. ప్రియుడి వేధింపుల కారణంగానే బాలిక ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. 
 
ఈ నెల 26వ తేదీన వారిద్దరి మధ్య ఏర్పడిన గొడవల అనంతరం ఆమెపై క్రూరంగా లైంగిక దాడి చేశాడని నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. పోస్టుమార్టం తర్వాత వైద్యులు ఇచ్చిన వివరాల ప్రకారం.. యువకుడిపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో యువకుడిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల ప్రకారం శారీరక దాడి, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
లైంగిక వేధింపుల కారణంగా బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయిందని, నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు