మరోసారి ముంబైను ఓ వార్త ఉలిక్కిపడేలా చేసింది. నేవీ బేస్ వద్ద కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయుధాలతో సంచరించినట్లు సమాచారం రావడంతో నేవీ అధికారులు ఎలెర్ట్ అయ్యారు. హుటాహుటిన నేవీ దళం సమాచారం వచ్చిన ప్రాంతాన్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టింది. ముంబై సమీపంలోని ఉరాన్ ప్రాంతంలో ఓ వ్యక్తి నల్ల దుస్తులు ధరించి ఆయుధాలతో సంచరిస్తున్నట్లు స్కూలు విద్యార్థులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.