మే 15 వరకు బీహార్‌లో సంపూర్ణ లాక్డౌన్

మంగళవారం, 4 మే 2021 (14:45 IST)
బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించారు. ఈ నెల 15వ తేదీ వరకు ఈ లాక్డౌన్ అమల్లోవుండనుంది. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్డౌన్‌ విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. మే 15వ తేదీ వరకు లాక్డౌన్‌ అమలులో ఉంటుందన్నారు. కేబినెట్‌ మంత్రులు, అధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. 
 
వివరణ్మాతక మార్గదర్శకాలు, ఇతర కార్యాకలాపాలకు సంబంధించి సంక్షోభ నిర్వహణ బృందాన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
 
రాష్ట్రంలో కరోనాను నియంత్రించాలని, లాక్‌డౌన్‌ ప్రకటించాలని పాట్నా హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంతకు ముందు ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. 
 
సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతున్నది. బిహార్‌లో నిన్న ఒకే రోజు 11,407 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డవగా.. 82 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం కేసులు 5.09లక్షలకు చేరగా.. 2,800 వరకు మృత్యువాతపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు