దేశ ప్రజలు కరోనా కష్టాలతో అల్లాడిపోతున్నారు. వీటికితోడు ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు, నర్సులు, సిబ్బంది చేస్తున్న చేష్టలకు మరింతగా విసుగెత్తిపోతున్నారు. ముఖ్యంగా, నానాటికీ కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతుంటే ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణాధార మందులను బ్లాక్ మార్కెట్ చేసి కొందరు అందినకాడికి దండుకుంటున్నారు.
రెమ్డిసివిర్ బాటిల్స్‌లో గ్లూకోజ్ నీళ్లను కలిపి కొవిడ్ రోగులు, బంధువులకు బాటిల్‌ను రూ.4500 నుంచి రూ.5000 వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. రెమ్‌డెసివిర్ బాటిల్‌లో 60 శాతం గ్లూకోజ్ వాటర్‌ను నిందితుడు కలిపేవాడు.