తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని మోహన్‌లాల్‌గంజ్‌కు చెందిన షానే అలి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే సదరు యువతి కుటుంబం ఆమెకు బంథ్రకు చెందిన షాహబుద్దిన్‌తో వివాహం నిశ్చయించింది. ఈ పెళ్లి ఇష్టం లేని యువతి షాహబుద్దిన్ అడ్డుతొలగించమని ప్రియుడ్ని కోరింది. దీంతో షానే అలి, షాహబుద్దిన్‌ను చంపటానికి పథకం వేశాడు.
పోలీసులు షాహబుద్దిన్ హత్యకు సంబంధించి యువతిని విచారించారు. మొదట తనకేమీ తెలియదని బుకాయించినప్పటికి, తర్వాత తన ప్రియుడే మృతుడ్ని చంపేసినట్లు వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.