ఈ వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌కు చెందిన దీపాళీ త్యాగి అనే మహిళ 2019, మార్చి 21న సదరు ఔట్‌లెట్ నుంచి శాకాహార పిజ్జాను ఆర్డర్ చేసింది. అయితే చెప్పిన సమయం కంటే అరగంట ఆలస్యంగా పిజ్జాను డెలివరీ చేశారు. మాంసాహార పిజ్జాను ఇవ్వడంతో రుచి చూశాక బిత్తరపోయాం. దాన్ని తినడం వల్ల మా మతపర మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ అపరాధ భావన జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది. పరిహార పూజల నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇలా ఎందుకు చేశారని అడిగితే... సదరు ఔట్‌లెట్ మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కుటుంబమంతటికీ ఉచితంగా పిజ్జాలను ఇస్తామంటూ మా సామాజిక, ఆర్థిక హోదాను కూడా కించపరిచారు అని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.