రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాలు, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలు, హర్యానా, చండీగడ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, యుపిలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ఉపశమించాయి. కానీ మరో రెండు రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
ఎగువ నుండి కురుస్తోన్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులకు వరద పెరిగింది. జూరాల, శ్రీశైలం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సూర్యారావుపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద ఆగడం లేదు. దీంతో భారీగా నీటికి కిందికి వదులుతున్నారు. డిండి, మూసీ ప్రాజెక్టుల్లోనూ భారీగా నీరు చేరింది.