రాగల 48 గంటలపాటు కోస్తాంధ్ర, రాయలసీమకు వర్షసూచన వుంది. కోస్తాంధ్ర , రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం వుంది.
రాగల 48 గంటలు రాయలసీమలో పలుచోట్ల 41°C -43°C అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం వుంది. వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల శాఖ కమిషనర్ తెలిపారు.