భార్యతో వివాహేతర సంబంధం.. పొరుగింటి వ్యక్తి ప్రాణాలు తీశాడు...

సోమవారం, 3 డిశెంబరు 2018 (14:30 IST)
నాసిక్‌లో ఓ వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. పొరుంగింటి వ్యక్తి ప్రాణాలు తీశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. అతడిని మట్టుబెట్టాడు. వివరాల్లోకి వెళితే.. 36 ఏళ్ల అనిల్ పింపుల్ తన భార్యతో కలిసి నాసిక్‌లో నివాసం వుంటున్నాడు.


అయితే అనిల్ పింపుల్ భార్య.. పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ఆవేశానికి గురైన అనిల్ పక్కింటి వ్యక్తిని హతమార్చాడు. ఈ ఘటనపై హత్యకు గురైన వ్యక్తి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అనిల్‌ను అరెస్ట్ చేశారు. భార్యపై అనుమానంతో అనిల్ ఈ పని చేశాడని.. విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు