వాట్సాప్‌తో చాటింగ్‌లు, ఫోటోలు షేర్ చేయడం వంటివి చేసే నేటి యువతకు ఓ ఎంబీబీఎస్ విద్యార్థి ఆదర్శంగా నిలిచాడు. వాట్సాప్ సాయంతో నిండు గర్భిణికి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణం కాపాడాడు. ఈ ఘటన అహ్మదాబాద్ పూరీ ఎక్స్‌ప్రెస్ నాగపూర్‌కు 30 కిలో మీటర్ల దూరంలో చోటుచేసుకుంది.
అదృష్టం కొద్దీ నాగపూర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, హాస్పటల్లో ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అయిన 24 ఏళ్ల విపిన్ అదే బోగీలో ప్రయాణిస్తున్నాడు. వెంటనే స్పందించిన విపిన్ వాట్సప్ ద్వారా తన సీనియర్ డాక్టర్ల సాయంతో ఆమెకు పురుడు పోశాడు. సీనియర్ లేడీ డాక్టర్ సలహాలతో ఆమెకు పురుడు పోశానని.. తనకు ఓ ముసలావిడ సాయం చేసిందని విపిన్ తెలిపాడు.