15రోజుల్లోగా వలసకార్మికులను తరలించాలి: సుప్రీం ఆదేశం

శుక్రవారం, 5 జూన్ 2020 (22:43 IST)
వలసకార్మికుల తరలింపులో తాత్సారం చేస్తున్న ప్రభుత్వాల పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరాల్లోనే మిగిలిన వలస కార్మికులను 15 రోజుల్లోగా వారి స్వంత ఊళ్లకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్ట్‌ ఆదేశాలు జారీ చేసింది.

వలస కార్మికుల సమస్యలపై ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్ట్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు చివరిసారిగా 15 రోజుల సమయాన్ని ఇస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరుపున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ జూన్‌ 3వ తేదీ వరకు రైల్వే శాఖ 4,228 శ్రామిక రైళ్లును నడిపినట్లు తెలిపారు.

ఈ రైళ్ల ద్వారా 57 లక్షల మంది కార్మికులను ఇళ్లకు చేర్చామని చెప్పారు. కాగా వలసకార్మికులు నడక ద్వారా దాదాపు 41 లక్షల మంది ఇళ్లుకు చేరుకున్నట్లు తెలిపారు.

ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌కు ఎక్కువ రైళ్లు వెళ్లాయని, రానున్న కాలంలోనూ ఇంకా ఎంతమంది వలస కార్మికులు ఉన్నారు, వీరికోసం ఎన్ని రైళ్లు నడపాలనే ప్రణాళిక తమ వద్ద ఉందని, రాష్ట్రాల వద్ద కూడా ఈ ప్రణాళిక ఉందని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు