అసాం లోని కామాఖ్యదేవి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. తాజాగా ఈ ఆలయానికి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రముఖ రిలయన్స్ అధినేత, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ దంపతులు భారీగా బంగారం విరాళంగా ఇచ్చారు. ఆలయగోపుర కలశాల తయారీ కోసం 19 కిలోల బంగారాన్ని ఇచ్చారు. ఈ బంగారంతో మూడు గోపుర కలశాలు రూపొందిస్తున్నట్లు కామాఖ్య ఆలయ వర్గాలు తెలిపాయి.
ఈ నిర్మాణ కార్యక్రమంలో శిల్పులతో పాటు రిలయన్స్ ఇంజినీర్లు కూడా పాలుపంచుకున్నారు. ఈ కలశాలు పూర్తయిన తర్వాత ముఖేష్ అంబానీ వారి భార్య నీతా అంబానీ అస్సాంలో కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని సందర్శనించనున్నా రు. దేశంలో గల శక్తి పీఠాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కామాఖ్య ఆలయం అస్సాంలోని నీలాచల కొండల్లో కొలువై ఉంది. ఇక్కడికి దేశవిదేశాల నుండి భక్తులు తరలి వస్తుంటారు.