మహిళలకు భద్రత కరువైంది. ఎక్కడపడితే అక్కడ అకృత్యాలు జరుగుతున్నాయి. ఆస్పత్రితో పనిచేసే ఓ వార్డు బాయ్ మహిళ పట్ల రెచ్చిపోయాడు. మందు రాస్తానని చెప్పి మహిళ లైంగికంగా వేధించాడు. ఎక్కడెక్కడో చేయి వేసి తడిమాడు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 24 ఏళ్ల ఓ మహిళ పైల్స్‌తో బాధపడుతూ మలాస్ ఈస్ట్ ఏరియాలోని ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రి చేయాలని వైద్యులు చెప్పారు.
ఆపరేషన్ పూర్తైన తర్వాత బాధిత మహిళ ఆస్పత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఐనా వారు పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయన్ని వివరించి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముకేష్ ప్రజపతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రోగి ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బంది పట్లా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.