తన భర్త నపుంసకుడని, అతనితో కాపురం చేయలేనని, అందువల్ల తనకు విడాకులు ఇప్పించాలని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. కర్నాటక రాష్ట్రంలోని షిమోగాకు చెందిన ఈ మహిళ భర్త వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
ఇలా కేసు దాఖలు చేసిందో లేదో భర్త ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం ప్రారంభించాడు. కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ వేధింపులు తట్టుకోలేక శుక్రవారం ఆమె ఆర్.టి. నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విచిత్రమైన కేసును నమోదు చేసుకున్న పోలీసులు దంపతులిద్దరిని స్టేషనకు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నట్లు తెలిసింది. యువతి నుంచి ఫిర్యాదు స్వీకరించినప్పటికీ ఆమె పేరును, ఇతర వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.