ఏపీ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం ఏర్పడింది. ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి నడిచే ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సోమవారం ఉదయం ఆరు గంటలకు ఢిల్లీలో బయల్దేరిన ఈ ఏపీ ఎక్స్‌ప్రెస్ గ్వాలియర్ వద్దకు చేరుకుంటుండగా అగ్నిప్రమాదం ఏర్పడింది.