దీనిపై ప్రియాంకా గాంధీ స్పందిస్తూ, అన్నింటినీ డబ్బులకు కొనుగోలు చేయలేమనే నిజాన్ని బీజేపీ ఓ రోజున గ్రహిస్తుందన్నారు. బీజేపీ నేతలు చెప్పే అబద్ధాలన్నీ ఒక రోజున బహిర్గతమవుతుయని చెప్పారు. అప్పటికు వరకు ఈ దేశ ప్రజలు తమను తాము కాపాడుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు.
కాగా, 225 సభ్యులు కలిగిన కర్నాటక అసెంబ్లీలో మంగళవారం రాత్రి జరిగిన విశ్వాస పరీక్షలో అధికార కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారుకు అనుకూలంగా 99 ఓట్లు రాగా, విపక్ష బీజేపీకి 105 సీట్లు వచ్చాయి.