మార్గమధ్యంలో విమానం ఉండగా సీట్లోనే మలమూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడు

మంగళవారం, 27 జూన్ 2023 (10:19 IST)
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఒక ప్రయాణికుడు విమానం గాల్లోనే ఉండగా తాను కూర్చొన్న సీట్లోనే మలమూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన ఈ నెల 24వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్లైటే ఏఐసీ 866 రకం విమానం ముంబై నుంచి ఢిల్లీకి వెళుతున్న విమానం మార్గమధ్యంలో ఉండగానే ఆ ప్రయాణికుడు ఈ పాడుపనికి పాల్పడ్డాడు. దీంతో ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. 
 
ఈ విషయం తెలిసిన వెంటనే విమాన సిబ్బంది (క్రూ సిబ్బంది) ఆ ప్రయాణికుడిని హెచ్చరించి, మరో సీట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఢిల్లీలో విమానం ల్యాండ్ కాగానే భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వారు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రయాణికుడిపై అసభ్యకర ప్రవర్తన, బహిరంగ ప్రదేశంలో మద్యంమత్తులో ఇబ్బందులు సృష్టించడం వంటి నేరాల కింద కేసు నమోదు చేశారు. 
 
విమానం ఇంజిన్‌‍లో పడి ఓ వర్కర్ దుర్మరణం.. ఎక్కడ?  
 
అమెరికాలో ఓ విషాదకర ఘటన జరిగింది. విమానం ఇంజిన్‌‍లో పడి ఓ వర్కర్ దుర్మరణం పాలయ్యాడు. టెక్సాస్‌లోని శాన్ యాంటోనియో విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు (ఎన్.టీ.ఎస్.బీ) వెల్లడించిన వివరాల మేరకు.. లాస్ ఏంజిల్స్ నుంచి టెక్సాక్‌కు వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం అరైవల్ గేటు వద్దకు చేరుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
అప్పటికి విమానంలోని ఒక ఇంజిన్ ఆన్‌లోనే వుంది. ఈ క్రమంలో ఇంజిన్, గాలితోపాటు వర్కర్‌ను కూడా లోపలికి పీల్చేసుకుంది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేశింది. తమ గుండె పగిలిందని వ్యాఖ్యానించింది. 
 
మృతుడు యూనిఫీ అనే సంస్థలో పని చేస్తున్నాడు.ఈ సంస్థ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్‌కు సంబంధించిన పనులు చేస్తుంది. అయితే, ఈ ప్రమాదానికి యూనిఫీ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఎస్బీ వెల్లడించింది. ఘటన జరిగిన సమయంలో భద్రతపరమైన నిబంధనలు ఉల్లంఘన జరగలేదని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు