జల్లికట్టు ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెటా రాధారాజన్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. జల్లికట్టు ఉద్యమంలో యువత, మహిళలు, ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొన్నారు. అయితే ఈ పోరాటంపై కొద్దిరోజుల క్రితం రేడియోకు ఇంటర్వ్యూ ఇచ్చిన పెటా సంస్థకు చెందిన రాధారాజన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ సెక్స్ కోసం జల్లికట్టు ఉద్యమం జరుగుతుందని రాధారాజన్ తెలిపారు.
రాధారాజన్ కామెంట్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అంతేగాకుండా ఫ్రీ సెక్స్ కోసం బీచ్లో జనం చేరుతారని రాధారాజన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెకు ఆందోళనకారులు నిరసనగా నినాదాలు చేశారు. ఆమె ఇంటిని ముట్టడించారు. తమిళ రాష్ట్రమంతా రాధారాజన్ కామెంట్లపై నిరసన తారాస్థాయికి చేరుకుంది.