ఢిల్లీ హైకోర్టు వద్ద పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

బుధవారం, 29 సెప్టెంబరు 2021 (12:22 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వరుస విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల రోహిణి కోర్టులో రౌడీ గ్యాంగ్‌ల మధ్య కాల్పులు వార్ జరిగింది. ఈ కాల్పుల్లో ప్రముఖ గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య గురయ్యాడు. 
 
తాజాగా ఢిల్లీ హైకోర్టు వ‌ద్ద ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బుధ‌వారం ఉద‌యం 10:15 గంట‌ల‌కు గేట్ నంబ‌ర్ -3 వ‌ద్ద కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. 
 
ఆత్మ‌హ‌త్య చేసుకున్న కానిస్టేబుల్‌ని రాజ‌స్థాన్ బెటాలియ‌న్‌కు చెందిన టింకూరామ్‌గా పోలీసులు గుర్తించారు. సెల‌వుల త‌ర్వాత కానిస్టేబుల్ టింకూరామ్ బుధవారం విధుల్లో చేరాడు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే టింకూరామ్ ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు