అలాగే, ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ హర్యానాలో భూమిని పొందారని దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. 2006లో ఫరీదాబాద్‌లోని వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి, 2010లో అదే ఏజెంట్‌కు విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని ఈడీ తన అభియోగాలలో పేర్కొంది.
ఆ లావాదేవీలు వాద్రా, థంపి మధ్య భాగస్వామ్య సంబంధాలు, పరస్పర వ్యాపార ప్రయోజనాలను వెల్లడిస్తాయని తన ఆరోపణలలో పేర్కొంది. ఈ కేసులో నిందితుడైన భండారీ 2016లో బ్రిటన్‌కు పారిపోయాడు. అతడిని వెనక్కి తీసుకురావాలని ఈడీ, సీబీఐ చేసిన అభ్యర్థనను ఈ ఏడాది జనవరిలో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించింది.