క‌రోనా బాధితుల‌కు ప్రియాంకా చేయూత‌!

శనివారం, 22 మే 2021 (11:23 IST)
ఉత్తరప్రదేశ్‌లోని కరోనా బాధితులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ యూపీ ఇన్‌ఛార్జి ప్రియాంక గాంధీ చేయూత‌ అందించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 30 వ వ‌ర్ధంతి సందర్భంగా, ప్రియాంక గాంధీ యూపీలోని కరోనా బాధితుల చికిత్స కోసం ఒక ట్రక్కులో ఔష‌ధాల‌ను పంపించారు.

ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా సంక్షోభం స‌మ‌యంలో త‌మ నేత‌ ప్రియాంక గాంధీ సేవా భావంతో బాధితుల‌ను ఆదుకుంటున్నార‌న్నారు.
 
యూపీలో ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డ‌టంతో ప్రియాంక గాంధీ  ఛత్తీస్‌గ‌ఢ్‌ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను ఇక్క‌డ‌కు పంపార‌న్నారు. త‌ద్వారా వందలాది మంది బాధితులు త‌మ ప్రాణాలు కాపాడుకోగ‌లిగార‌న్నారు.

యూపీ రాజధాని లక్నోతో సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో హోం క్వారంటైన్‌లో ఉన్న‌వారికి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్రియాంకా గాంధీ పంపిన ట్ర‌క్కులో సుమారు 50 వేల కరోనా హోమ్ ఐసోలేషన్ కిట్‌లు ఉన్నాయ‌న్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు