కొల్లం సముద్రంలో ఈత కొట్టిన రాహుల్ గాంధీ (వీడియో వైరల్)

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (13:10 IST)
పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చాలా ఉల్లాసంగా గడుపుతున్నారు. ముఖ్యంగా ప్రజలతో మమేకమైపోతున్నారు. అలాగే, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వయనాడ్ లోక్‌సభ స్థానంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. అదేసమయంలో కేరళ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తూ ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ, ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైపోతున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ త‌మ పార్టీని బ‌ల‌ప‌ర్చే ప్రయ‌త్నాలు చేస్తున్నారు.
 
ఇదిలావుంటే, కొల్లాం తీరంలో బుధవారం పర్య‌టించి, మత్స్య‌కా‌రు‌లతో మాట్లాడుతూ వారి ఇబ్బందుల‌ను తెలుసుకున్నారు. వారితో కలిసి ఓ పడ‌వలో సము‌ద్రం‌లోకి వెళ్లి, చేప‌లను పట్టేం‌దుకు వలను విసిరారు. 
 
అనంత‌రం మత్స్య‌కా‌రు‌లతో క‌లిసి ప‌డ‌వ‌లోంచి సము‌ద్రం‌లోకి దూకి ఈత‌కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ వీడియోను కాంగ్రెస్ వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి. 


 

#WATCH| Kerala: Congress leader Rahul Gandhi took a dip in the sea with fishermen in Kollam (24.02.2021)

(Source: Congress office) pic.twitter.com/OovjQ4MSSM

— ANI (@ANI) February 25, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు