నిండు గర్భిణి.. ఇంకా భర్త దగ్గరే వుండాల్సిన పరిస్థితి. దీనికోసం తన 15ఏళ్ల చెల్లిని ఇంటికి తెచ్చుకుంది. అయితే కట్టుకున్న భర్త మైనర్ చెల్లిపై అఘాయిత్యానికి పాల్పడటంతో తట్టుకోలేక భర్తనే దారుణంగా హత్య చేసింది. అంతేగాకుండా భర్త శవాన్ని ఇంటి వెనుక పాతిపెట్టి.. అనంతరం పోసుల ఎదుట లొంగిపోయిన ఘటన రాజస్థాన్‌లో సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, శిఖర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన నిండు గర్భిణి.. తన భర్తని దారుణంగా హత్య చేసింది. తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉన్న ఆమెకు చేదోడువాదోడుగా ఉండేందుకు ఎనిమిదో తరగతి చదువుతోన్న ఆమె చెల్లెలు.. అక్క ఇంటికొచ్చింది.