వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోతారనే విషయం తమకు ముందే తెలుసునని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్వామి అనుమానం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతాన్ని ప్రస్తావిస్తూ.. సుపారీ హత్య లేదా పథకం ప్రకారం ఆర్థిక ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీని చంపించినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు.
రాజీవ్ గాంధీ హత్యపై దర్యాప్తు జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ హంతకులను క్షమిస్తున్నట్లు రాహుల్ గాంధీ చేసిన ప్రకటన దేశభక్తి లేకపోవడానికి నిదర్శనమని సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు. రాజీవ్ గాంధీ అచ్చమైన జాతీయ వాది అని.. ఆయన హత్యకు బాధ్యులైన వారిలో విధేయత లేదన్నారు. అలాంటి వారి పట్ల సానుకూలత చూపించాల్సి అవసరం ఏమొచ్చిందని తెలిపారు.