కరోనా వైరస్ ఎఫెక్ట్.. ఉద్యోగాల్లేవంటూ నగ్న ప్రదర్శన

గురువారం, 11 జూన్ 2020 (12:47 IST)
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం కుదేలైంది. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన కొంత మంది వ్యక్తులు వినూత్న నిరసనకు దిగారు. ఒంటిపై ఎటువంటి దుస్తులు లేకుండా నగ్న ప్రదర్శనకు దిగారు. రష్యాలో జరిగిన ఈ ఆందోళనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా రష్యాలో పరిస్థితి దారుణంగా వుంది. అక్కడ బార్లు, రెస్టారెంట్లు, షెఫ్ కంపెనీలన్ని నష్టాల్లోకి వెళ్లాయి. 
 
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారిని తొలగించడమే మార్గంగా భావించారు. ఈ పరిస్థితుల్లో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. వారంతా సోషల్ మీడియా వేధికగా, ఇతర మార్గాల ద్వారా వినూత్న నిరసనలు తెలుపుతున్నారు.
 
కొంత మంది ఉద్యోగులు ఒంటిపై ఏమి లేకుండా నగ్న ప్రదర్శనకు దిగారు. చూసే వారికి ఇబ్బంది లేకుండా అడ్డుగా బోర్డులు, చేతులు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు