ముంబై ఎయిర్‌పోర్టులో రెండు ముక్కలైన విమానం... ఎందుకని?

శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (10:18 IST)
ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణించిన ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గురువారం ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కూడిన ప్రైవేట్ జెట్ విమానం రన్‌పై పై జారి పక్కకు వెళ్లిపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 
 
వీఎస్ఆర్ వెంచర్స్ లీర్ జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ వీటీ - డీబీఎల్ విమానం విశాఖపట్నం నుంచి ముంబైకి బయలుదేరింది. ముంబైలో ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు రన్‌‍వే పై జారి, పక్కకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో విమానం రెండు ముక్కలైంది. విమానంలో ఉన్న ఎనిమిది మందికి స్వల్పగాయలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు.
 
గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 700 మీటర్లకు మించి విజిబులిటీ లేదని డీజీసీఏ తెలిపింది. రన్‌ వే 27పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ రన్‌ వేపను కొద్దిసేపు మూసివేశారు. ఆ సమయంలో దిగవలసిన ఐదు విమానాలను మరోచోట దింపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

 

A private plane (VSR Ventures Learjet 45 aircraft VT-DBL) skidded off the runway and crashed while landing at Mumbai Airport due to heavy rain.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు