తెలంగాణలో వరదలు.. ధ్వంసం అయిన 49 వంతెనలు

శనివారం, 29 జులై 2023 (15:18 IST)
తెలంగాణను వరదలు ముంచేశాయి. దీంతో మొత్తం 49 వంతెనలు ధ్వంసం అయ్యాయి. భారీ వర్షాల ప్రభావానికి రాష్ట్రంలో మొత్తంగా 49 బ్రిడ్జీలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.
 
జాతీయ రహదారులకు సంబంధించి 11 చోట్ల వంతెనలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర రహదారుల విషయంలో 38 ప్రాంతాల్లో బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 
 
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా 15 వంతెనలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లాలో 10 బ్రిడ్జిలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 , ఆదిలాబాద్‌లో 3 వంతెనలు కూలిపోయాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు