సముద్రపు నీరు ఎరుపు రంగులో మారిపోయింది.. కారణం?

గురువారం, 2 నవంబరు 2023 (10:26 IST)
Puducherry
పుదుచ్చేరి వద్ద సముద్రపు నీరు ఎరుపు రంగులో మారిపోయింది. గత నాలుగైదు రోజులుగా సముద్రపు నీటిలో రంగుమార్పుతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఎందుకిలా జరుగుతోందో అర్థంకాక టెన్షన్ పడుతున్నారు. 
 
ఈ మార్పులపై కొందరు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు రంగు మారిన సముద్రపు నీటి శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. 
 
ఇటీవల విశాఖపట్నం బీచ్‌ వద్ద కూడా సముద్రపు నీరు నల్లగా మారడంతో కలకలం రేగింది. తమిళనాడులోని పలు బీచ్‌ల్లోనూ సముద్రపు నీటి రంగు మారడం చర్చనీయాంశంగా మారింది.  
 
నీటిలో ఆల్గే వంటి సూక్ష్మజీవులు ఉన్నా లేక ఇతర పదార్థాలు ఉన్నా రంగు మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు