ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంచి జీతం, ఏసీ గదులు ఇలా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆమె మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం యేడాదిన్నరపాటు శిక్షణ తీసుకున్నారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోనే ఆర్టీసీలో చేరానని చెబుతున్నారు.
కాగా, మహారాష్ట్రలో ఆర్టీసీలో మహిళా కండక్టర్లు ఇప్పటికీ ఉన్నప్పటికీ 2019 మార్చిలో మరోమారు మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 194 మందిని ఎంపిక చేశారు. మధ్యలో కరోనాతో విరామం రాగా, చివరకు 17 మంది మగిలాలు. వీరిలో శీతల్ షిండే ఒకరు. మార్చి నెలలో మహారాష్ట్ర ఆర్టీసీ తొలి బ్యాచ్ మహిళా డ్రైవరుగా ఆమె విధుల్లో చేరనున్నారు.