అలా అయితే, 75 ఏళ్లకు పైబడిన వృద్ధ నేతలను మార్గదర్శన మండలి పేరుతో వనవాసానికి పంపే బీజేపీ ఇప్పుడు మెట్రోమ్యాన్‌ను సీఎం అభ్యర్థిగా తీసుకువస్తోందని తెలిపారు. అందుకే, అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్ వంటి కురువృద్ధులు 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు.
బీజేపీ అధినాయకత్వం 75 ఏళ్లకు పైబడిన వృద్ధులను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పిస్తున్న నేపథ్యంలో సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం అద్వానీ వయసు 93 ఏళ్లు కాగా, జోషి వయసు 87 సంవత్సరాలు. వారిద్దరి అనుభవం దృష్ట్యా పార్టీకి సలహాలు ఇచ్చే మార్గదర్శన మండలిగా వారిని పరిగణనలోకి తీసుకుంటున్నారు.