ఆ తర్వాత మంగళవారం రాత్రి 10 గంటలకు రిసార్టు నుంచి పోయెస్ గార్డెన్‌కు బయలుదేరేముందు ఎమ్మెల్యేలనుద్దేశించి శశికళ చివరిసారిగా ప్రసంగించారు. జరుగుతున్న కుట్రలు, వాటి వెనుక ఉన్న నేతలెవ్వరన్నది ఎమ్మెల్యేలంతా గ్రహించే ఉంటారని, అందరూ ఐకమత్యంగా ఉండి పార్టీని కాపాడుకోవాలని సూచించారు. తనకు శిక్ష పడినా, ‘అమ్మ’ ఈ బాధల నుంచి తప్పించుకున్నందుకు ఆనందంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు. పది నిమిషాల ప్రసంగంలో ఆమె నాలుగుమార్లు కన్నీటిపర్యంతమయ్యారు.