తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూకాలోని రంగాపురానికి చెందిన సంపత్‌రెడ్డి కుమార్తె అర్చనాదేవి (21)కి నెల రోజుల క్రితం వేలూరు జిల్లా పుదూరుకు చెందిన తంగరాజుతో వివాహమైంది. ఆమెతో నెల రోజుల పాటు సంసారం చేశాడు. అయితే, అప్పటికే మరో యువతి ప్రేమలో మునిగి తేలుతున్న తంగరాజు తాజాగా ప్రియురాలితో కలిసి పరారయ్యాడు.
అవమాన భారం తట్టుకోలేని అర్చన పుట్టింటికి చేరుకుంది. తీవ్ర మానసికక్షోభకు గురైన ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.