ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్కు దేశంలోని బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల నుంచి రాజకీయ, నైతిక మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తమ పార్టీతో తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ యూపీలో పొత్తు కుదుర్చుకున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
యూపీలో బీజేపీ తరఫున ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగితే అఖిలేశ్ ఒంటరిగా ప్రచారం చేయాల్సి వస్తోందని, ఈ నేపథ్యంలో, ఇతర పార్టీల నేతలను రంగంలోకి దింపితే ఎలా ఉంటుందన్న విషయంపై చర్చ జరుగుతోందని ఆ వర్గాలు వివరించాయి.
కాగా, మరో వారం, పది రోజుల్లో తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు స్టాలిన్, కేసీఆర్, ఉద్దవ్ ఠాక్రే ఢిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, శరద్ పవార్, మమతా బెనర్జీ తదితరులతో కలిసి వారు కార్యాచరణ రూపొందించే అవకాశాలున్నాయని ఈ వర్గాలు తెలిపాయి.
కాగా, ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించేందుకు ఎస్పీకి మద్దతుగా టీఆర్ఎస్ అక్కడ ప్రచారం చేసే ఆలోచన ఉందా అని ఆస్క్ కేటీఆర్ సందర్భంగా శుక్రవారం ఓ నెటిజన్ ప్రశ్నించగా.. త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం.