అయితే, ఎపుడో జరిగిన నిర్భయ కేసులో దోషులుగా తేలినవారికి మాత్రం ఇప్పటివరకు శిక్షలు అమలు చేయలేదు. పైగా, వీరంతా తీహార్ జైలులో దర్జాగా తిని తిరుగుతున్నారు. అయితే, తెలంగాణలో జరిగిన దిశా ఘటనలో కొన్నిరోజులకే నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై అన్ని రాష్ట్రాల నుంచి సానుకూల స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నాడు నిర్భయ కేసును దర్యాప్తు చేసిన మాజీ సీపీ నీరజ్ కుమార్ తాజాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించారు.
తాము నిర్భయ కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలో విపరీతమైన ఒత్తిళ్లు వచ్చాయని, అయితే తమకు ఎన్‌కౌంటర్ ఆలోచన రాలేదని వెల్లడించారు. నిందితులను తమకు హ్యాండోవర్ చేయాలంటూ కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, కానీ చట్టం ద్వారానే నిందితులను శిక్షించాలన్న ఆలోచనతో తాము ఆ సందేశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని వివరించారు.