గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధాన కారణం బుల్లెట్ రైలు ప్రాజెక్టు. దేశంలో ఎన్నో మెట్రో నగరాలు ఉన్నప్పటికీ, వాటినన్నింటినీ పక్కనబెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌ను ఎంచుకున్నారు. ఇది బీజేపీకి బాగా కలిసివచ్చింది.
అందులో మొదటిది ప్రధాని నరేంద్ర మోడీ తమ రాష్ట్రవ్యక్తి కావడం. రెండోది బుల్లెట్ రైలు ప్రాజెక్టు. దేశంలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాలున్నా బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు మోడీ గుజరాత్‌ను ఎంచుకున్నారు. గుజరాత్ ప్రజలు తమ వాణిజ్య అవసరాల కోసం ఎక్కువగా వాణిజ్య రాజధాని ముంబైకి వెళ్తుంటారు. దీనిని సరిగ్గా గుర్తించిన మోడీ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఓకే చెప్పారు.