స్వదేశీ ఆపరేటింగ్ సిస్టం BharOS విజయవంతం

బుధవారం, 25 జనవరి 2023 (15:28 IST)
ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసిన స్వదేశీ ఆపరేటింగ్ సిస్టం 'భారోస్'ను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్ మంగళవారం విజయవంతంగా పరీక్షించారు. బలమైన, స్వదేశీ, విశ్వసనీయత కలిగిన డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా దేశంలోని పేద ప్రజలే ప్రధాన లబ్దిదారులు అవుతారని చెప్పారు. డేటా ప్రైవసీ దిశగా బార్ఓఎస్ విజయవంతమైన ముందడుగు అని ప్రధాన్ పేర్కొన్నారు. 
 
ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ లో ఇంక్యుబేషన్ చేసిన జాండ్కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జాండ్కాప్స్) బార్ఓఎస్ అభివృద్ధి చేసింది. కమర్షియల్ ఆఫ్ ది షెల్ఫ్ హ్యాండ్ సెట్లలో ఈ వ్యవస్థను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. 
 
కఠినమైన గోప్యత , భద్రతా ఆవశ్యకతలను కలిగి ఉన్న సంస్థలకు మొబైల్స్ లోని నిషేధిత అనువర్తనాలలో రహస్య కమ్యూనికేషన్లు అవసరమయ్యే సున్నితమైన సమాచారాన్ని నిర్వహించే సంస్థలకు భార్ఓఎస్ సేవలు ప్రస్తుతం అందించబడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు