పుట్టింటికి వచ్చిన కొన్ని నెలలు అయినా తాను, తన కుమార్తె గురించి పట్టించుకోలేదు. దీంతో విరక్తి చెందిన మహిళ భర్తకు తలాఖ్ చెప్పేసింది. మతం ఆచారం ప్రకారం విడాకులు తీసుకుంది. ఈ సందర్భంగా రాయ్ బరేలీలో బాధితురాలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆరేళ్ల క్రితం తనకు వివాహం అయ్యిందని.. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది.
తనకు కుమార్తె పుట్టిన తరువాత వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని ఆమె ఆరోపించారు. అదనపు కట్నం తీసుకురావాలని తన కుమార్తెను తన భర్త ఓ సారి కిడ్నాప్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. అత్తింటివారి ఆగడాలు భరించలేక తాను పుట్టింటికి చేరుకున్నానని అన్నారు. అందుకే చేసేది లేక భర్తకు ట్రిపుల్ తలాక్ చెప్పేసినట్లు బాధితురాలు తెలిపింది.