గడియారం దొంగలించిందని స్టూడెంట్‌పై కోచ్ దాడి.. తర్వాత ఏమైందంటే?

సెల్వి

బుధవారం, 30 అక్టోబరు 2024 (15:35 IST)
తమిళనాడులోని కృష్ణగిరిలో వాలీబాల్ కోచ్ అక్టోబర్ 23న ఒక టోర్నమెంట్ సందర్భంగా విద్యార్థినిపై దాడికి పాల్పడినందుకు గాను సోమవారం అరెస్టు అయ్యాడు. ఈ సంఘటనను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేయడంతో కోచ్‌పై తక్షణమే చర్యలు తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. నిందితుడు హోసూరుకు చెందిన వి.త్యాగరాజన్ (38) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. బాగలూరు సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ టోర్నమెంట్ నిర్వహించబడిందని, ఇందులో అనేక పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 
 
ఆతిథ్య పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు త్యాగరాజన్‌కు అతని బృందంలోని ఒక అమ్మాయి తన చేతి గడియారాన్ని దొంగిలించిందని దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోచ్‌ను అరెస్ట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు