భారీ రైలు ప్రమాదాన్ని తప్పించిన బాలుడు.. ఎక్కడ?

ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (09:08 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు భారీ రైలు ప్రమాదాన్ని నివాహించాడు. దీంతో ఆ బాలుడిని ప్రతి ఒక్కరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ ఘటన బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, మలాల్దా జిల్లాకు చెందిన ముర్సెలీమ్ (10) అనే బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. 
 
శుక్రవారం మధ్యాహ్నం అతడు స్థానికంగా ఉన్న ఓ కుంటలో చేపలు పట్టేందుకు వెళుతుండగా రైలు పట్టాల కింద గొయ్యి కనిపించింది. మరోవైపు, అగర్తల - సియాల్‌గా కాంచన్‌గంజుంగా ఎక్స్‌ప్రెస్ వేగంగా వస్తుండటాన్ని గుర్తించారు. 
 
రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన ఆ బాలుడు క్షణం ఆలస్యం చేయకుండా పట్టాల వద్ద నిలబడి తాను ధరించిన ఎర్రని టీషర్టును తీసి గాల్లో ఊపుతూ ట్రెయిన్ లోకోపైలట్‌ను అప్రమత్తం చేశాడు. బాలుడి సిగ్నల్‌ను గమనించిన లోకో‌పైలెట్ వెంటనే రైలును ఆపేశారు. 
 
ఆ తర్వాత ఆ బాలుడు నిలబడిన చోటుకు వచ్చి చూడగా అక్కడ పట్టాల కింద గొయ్యి కనిపించింది. అక్కడి కంకర కొట్టుకుపోవడంతో గొయ్యి ఏర్పడినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించిన ఆయన బాలుడిని అభినందల్లో ముంచెత్తారు. 
 
రైల్వే సిబ్బంది వచ్చి గొయ్యిని పూడ్చిన తర్వాత అంటే ఓ గంట ఆలస్యంగా రైలు బయలుదేరి వెళ్లింది. కాగా, పెను ప్రమాదం తప్పించిన బాలుడి పేరును అవార్డు కోసం సిఫారసు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు