చైన్ స్నాచ్ ఘటన.. మహిళను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లారు

సెల్వి

బుధవారం, 23 అక్టోబరు 2024 (11:30 IST)
chain snatching
తమిళనాడులోని మధురైలో ఘోరం జరిగింది. చైన్ స్నాచ్ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. చైన్ కోసం ఓ మహిళను దుండగులు ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో భార్యాభర్తలిద్దరూ ఎక్కడికో వెళ్లి.. ఇంటి ముందు టూవీలర్‌ను ఆపారు. అంతే ఎక్కడి నుంచో బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని లైన్ లాగారు. అయితే అది చేతికి రాకపోవడంతో ఆ మహిళను కూడా ఈడ్చుకెళ్లారు. 
 
చైన్ స్నాచింగ్ చేసే క్రమంలో మహిళను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లడాన్ని చూసిన భర్త.. పరుగులు తీశాడు. ఈ క్రమంలో అతనికి కూడా గాయాలైనాయి. చివరికి, గొలుసు తెగిపోయింది, ఒక భాగం నిందితుల చేతుల్లోకి మరియు మరొక భాగం మంజుల వద్ద మిగిలిపోయింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఇది దారుణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు అధికారులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

ఘోరం.. చైన్ కోసం మహిళను ఈడ్చుకెళ్లారు!

తమిళనాడులోని మధురైలో ఘటన

చైన్ స్నాచింగ్ చేసే క్రమంలో మహిళను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లిన చైన్ స్నాచర్లు

గొలుసు తెగి రెండు భాగాలు కాగా, ఒక భాగం బాధితురాలి వద్ద ఉండిపోయింది

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో #Chennaipic.twitter.com/MCtJRQ5wSX

— BIG TV Breaking News (@bigtvtelugu) October 23, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు