దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో దుర్గాపూజ చేస్తే...!?
మంగళవారం, 4 అక్టోబరు 2011 (16:11 IST)
FILE
ఈ రోజు దుర్గాష్టమి. ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు దుర్గాదేవిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని పెద్దలు చెబుతున్నారు.
అయితే మొదటి మూడు రోజుల్లో దుర్గాదేవి పూజించలేని భక్తులు దుర్గాష్టమి, విజయదశమి నాడు ఈ కింది విధంగా పూజ చేస్తే అష్టైశ్వర్యాలు, సుఖజీవనం వంటి శుభఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు.
రాక్షసుడు మహిషాసురుడిని కాళికా దేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం. అలాగే దుర్గాదేవీ పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం.
ప్రాణ ప్రతిష్ట చేయు విధానం అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి, పళ్లు, ఫలాలను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ప్రాణప్రతిష్ట చేసేందుకు పువ్వులు, అక్షింతలను పట్టుకుని అమ్మవారి పాదాలను పట్టుకుని కింది మంత్రములను పఠించాలి.
శుద్ధోదకం (మంచినీరు) స్నానం చివరగా అమ్మవారికి మంచినీటిలో స్నానం చేయించి పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. తర్వాత పత్తితో చేసిన ఉపవీతం సమర్పించుకోవాలి. తర్వాత ఈ క్రింది మంత్రం చదువుతూ గంధం వేయవలెను
మంత్రపుష్పమ్ చేతిలో అక్షింతలు, పువ్వులను ఉంచుకుని మంత్రపుష్పమ్ చెప్పవలెను. ఇక్కడ పెద్ద మంత్రపుష్పమ్ లేదా చిన్న మంత్రపుష్పమ్ చెప్పవలెను లేదా శ్రీ సూక్త ఫలమును పఠించవలెను.
తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయవలెను. అనంతరం తీర్థం పుచ్చుకుంటూ ఈ మంత్రాలను జపించవలెను.