ప్రాణహిత పుష్కరాలను ప్రారభించిన సీఎం కిరణ్ కుమార్

అదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత పుష్కరాలను ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం ప్రారంభించారు. అర్జునగుట్ట వద్ద ఈ పుష్కరాలను ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఆయన కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదిమాతల్లికి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ఆరంభించారు. ముఖ్యమంత్రి పుష్కర స్నానం ఆచరించారు.

అలాగే, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరిలో మంత్రి శ్రీధర్ బాబు పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లాల్లో అదిలాబాద్ జిల్లా బాగా వెనుకబడి ఉందన్నారు. ఈ జిల్లా అభివృద్ధికి దివంగత ముఖ్యంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఎంతగానే అభివృద్ధి చేశారన్నారు. ఆయన ఆశయ సాధన దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

వెబ్దునియా పై చదవండి