సూరి హత్యకు నా కుమారుడికి సంబంధం లేదు: సబితా

శుక్రవారం, 7 జనవరి 2011 (09:06 IST)
తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెర్వు సూర్యానారయణ రెడ్డి అలియాస్ సూరి ఈ సోమవారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర కోణాలు వెలుగు చూస్తున్నాయి. సూరి హత్యకు కుట్ర పన్నిన వారిలో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. సూరిని తన అనుచరుడే భానుయే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సూరి హత్య వెనుక కేవలం భాను మాత్రమే కాకుండా పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పేర్లలో రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపించింది. తన తల్లి అధికారాన్ని ఉపయోగించుకొని కార్తీక్ బెదిరింపులకు పాల్పడేవాడని, ఇటీవల విజయవాడలో జరిగిన ఓ భారీ సెటిల్మెంట్‌లో కూడా అతని హస్తం ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయితే హోంమంత్రి మాత్రం ఈ వార్తలను తీవ్రంగా ఖండిచారు. ఇవన్నీ నిరాధారమైనవి, అర్థంలేని ఆరోపణలని సబిత చెప్పారు. ఈ కుట్రకు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఆమె అన్నారు. కానీ.. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారు ఒక్కొరుగా హత్యకు గురికావడంపై పెద్దతలలే ఉండి ఉంటాయని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేసిన ఆరోపించడంతో పాటు.. కార్తీక్‌పై వస్తున్న పలు ఆరోణలపై ఆమె వివరణ ఇచ్చారు. సూరి హత్యకు తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని, ఈ వివాదంలో తమను లాగొద్దని సబిత స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి