ప్రజలకోసమే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందనీ, దానిని అడ్డుకోవద్దని సబితా ఇంద్రారెడ్డి కోరారు. రచ్చబండలో సమస్యలకు సత్వర పరిష్కారాలను చూపడమే కాక సంక్షేమ పథకాల అమలుతీరుపై ప్రజలు నాయకులను అడిగి తెలుసుకోవచ్చన్నారు.
ముఖ్యంగా వృద్ధాప్య ఫించన్, పావలా వడ్డీ రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాల ద్వారా కొత్తవారికి లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ రచ్చబండను ఏర్పాటు చేసిందని ఆమె చెప్పుకొచ్చారు.
కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలకోసం రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయని ఆమె అన్నారు. ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వ సాయాన్ని పొందేందుకు సహకరించాలని ఆమె కోరారు.