ఖగోళంలో అద్భుత దృశ్యం.. శుక్రుడి అంతర్యానం కనువిందు!
బుధవారం, 6 జూన్ 2012 (13:03 IST)
PTI
ఖగోళంలో అద్భుత దృశ్యం... సూర్యుడి మీదుగా శుక్రుడి పయనం. ఈ శుక్రగ్రహ అంతర్యానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బుధవారం వీక్షించారు. వినీలాకాశంలో చోటు చేసుకున్న మహాద్భుతాన్ని విజయవాడ ప్రజలు చూసి తరించారు. వీనస్ ట్రాన్సిట్ను చూసేందుకు బెజవాడ వాసులు ఉదయం నుంచే కృష్ణా బ్యారేజీ వద్ద బారులు తీరారు.
సూర్యుడు, శుక్రుడు, భూమి దాదాపు సమాన దూరంలో ఒక సరళరేఖలో వచ్చినప్పుడు మాత్రమే ఈ అద్భుతాన్ని వీక్షించటం జరుగుతుంది. ఇందుకోసం వరంగల్ ప్లానిటోరియం విజ్ఞ అకడమిక్ సైన్స్ సెంటర్, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌లోని ప్లానిటోరియం, వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాట్లు చేశారు.
ఈ అద్భుతాన్ని చూసేందుకు బైనాక్యులర్స్, టెలిస్కోప్స్, ఫిల్టర్స్, ప్రొజెక్టర్స్‌ను ప్లానిటోరియం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కాగా ఈ శతాబ్దికే ఆఖరి శుక్ర అంతర్యానమిది. మళ్లీ ఈ అద్భుతం 2117లో కనిపించనుంది.