కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కృష్ణా జిల్లా అనుమంచిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరగణంతో అనుమంచిపల్లికి బయలుదేరారు. వీరిని కూడా పోలీసులు మార్గమధ్యంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనస్సు మార్పించేందుకు సోమవారం కృష్ణా జిల్లా గరికపాడులో వస్తునా మీకోసం పాదయాత్ర ద్వారా అడుగుపెడుతున్న బాబును కలిసేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ వేశారు.
అయితే, కాంగ్రెస్, టీడీపీ నేతలు ఒక చోటు చేరితే అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, లగడపాటి రాజగోపాల్‌ను హౌస్ అరెస్టు చేయగా, దేవినేని నెహ్రూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.