ఉండవల్లి అరుణ్ కుమార్ : రాజ్యాంగమే ప్రామాణికం!

గురువారం, 19 సెప్టెంబరు 2013 (08:54 IST)
File
FILE
రాష్ట్ర విభజనను రాజ్యాంగం మేరకు ముందుకు సాగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం సాయంత్రం ప్రణబ్‌తో అరంగట పాటు కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని రాష్ట్రపతికి వివరించారు.

ముఖ్యంగా రాష్ట్ర విభజన నిర్ణయంతో తలెత్తే రాజ్యాంగ పరమైన సమస్యలు, గతంలో రాష్ట్రాలను ఏర్పరచినప్పుడు అవలంభించిన పద్ధతులు, దృష్టాంతాలపై వారు సుదీర్ఘ సంభాషణలు జరిపినట్లు సమాచారం.

భారతదేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాజ్యాంగాన్నే అత్యంత ప్రామాణికంగా భావిస్తామని, దీంతోపాటు గతంలోని దృష్టాంతాలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని ప్రణబ్ చెప్పారని ఉండవల్లి మీడియాకు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి