లగడపాటి : స్పీకర్ మీరా కుమార్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్

FILE
తన రాజీనామాను ఆమోదించడం లేదంటూ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌పై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఆగస్టు 2వ తేదిన స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇచ్చానని, దానిని ఆమోదించలేదని ఆయన కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొన్నారు.

తాను రాజీనామా చేసి 65 రోజులు గడుస్తున్నప్పటికీ దానిని స్పీకర్ ఆమోదించలేదని, దానిని ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తన అభీష్టానికి విరుద్ధంగా తనను ఎంపీగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. స్పీకర్ రాజీనామాపైన నిర్ణయం తీసుకోకపోవడంతో తాను ఇష్టం లేకున్నా పదవిలో కొనసాగుతున్నానని అందులో ప్రస్తావించారు.

వెబ్దునియా పై చదవండి