దానం నాగేందర్ ఓ కబ్జాకోరు : షర్మిల ఘాటు విమర్శలు

ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (17:26 IST)
IFM
FILE
మాజీ మంత్రి దానం నాగేందర్ ఓ కబ్జాకోరు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల ఘాటు విమర్శలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి మద్దతుగా ఆమె ఆదివారం ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఎస్ మక్తాలోని మైనార్టీ భూములను కబ్జా చేసిన దానం... మంత్రిగా ఉన్న సమయంలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆమె నిప్పులు చెరిగారు. ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశీస్సులతోనే దానం గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

అందువల్ల ఖైరతాబాద్‌లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిని గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఆమె కోరారు. ఆమె గెలిచాక ఆ భూమిని మైనార్టీలకు అప్పగించే చర్యలు చేపడతామని షర్మిల హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి